ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగూరు జల విద్యుత్‌ కేంద్రంలో

ABN, First Publish Date - 2020-10-08T08:33:00+05:30

సింగూరు ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రంలో 0.712 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు జెన్‌కో ఏడీఈ సౌజన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్‌కల్‌, అక్టోబరు 7 : సింగూరు ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రంలో 0.712 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు జెన్‌కో ఏడీఈ సౌజన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4, 5వ తేదీల్లో మంజీర రిజర్వాయర్‌కు సింగూరు ప్రాజెక్టు నుంచి 0.5 టీఎంసీ జలాలను విడుదల చేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎడమ వైపున నిర్మించిన రెండు 7.5 మిలియన్‌ యూనిట్ల సామర్థ్యం గల టర్బైన్ల ద్వారా జలాలను విడుదల చేశామని తెలిపారు.


48 గంటల పాటు రెండు టర్బైన్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో 0.712 మిలియన్‌ యూనిట్ల జల విద్యుదుత్పత్తిని చేశామని ఆమె వెల్లడించారు. ఈ నెల 4న ప్రారంభమైన నీటి విడుదల 6 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిందని తెలిపారు. అయితే 0.5 టీఎంసీ నీటి విడుదల పూర్తి కావడంతో రెండు జల విద్యుత్‌ గేట్లను మూసివేశామని పేర్కొన్నారు. రెండు టర్బైన్ల ద్వారా ఉత్పత్తయిన జల విద్యుత్‌ను సదాశివపేట, జోగిపేట ఫీడర్ల గుండా పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేశామని వివరించారు.

Updated Date - 2020-10-08T08:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising