ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.20 కోట్ల నష్టం

ABN, First Publish Date - 2020-10-31T06:55:31+05:30

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. ఫలితంగా నీటి పారుదల శాఖకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో ఈనెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెరువుల గండ్ల మరమ్మతుకు నష్టం అంచనా వేసిన అధికారులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి)

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. ఫలితంగా నీటి పారుదల శాఖకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో ఈనెల రెండోవారంలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు వేల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగి రైతులకు అపార నష్టం కలిగింది. కాగా వరద నీటితో జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులు నిండాయి. చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి.


అదే సమయంలో అనేక చెరువుల కట్టలు కొట్టుకుపోయి రూ.20 కోట్ల నష్టం కలిగిందని అధికారవర్గాలు తెలిపాయి. దెబ్బతిన్న చెరువులలో ప్రధానంగా అందోలు మండలం డాకూర్‌ కుడిచెరువు, కంది మండలంలో దేవుని చెరువు, ఇంద్రకరణ్‌ బతుకమ్మ కుంట, కొండాపూర్‌ మండలం మల్లేపల్లి మైసమ్మ కుంట, మల్కాపూర్‌ పెద్ద చెరువు, గోపులారం చెరువు, పటాన్‌చెరు మండలం బచ్చుగూడ నల్లచెరువు, కర్దనూర్‌ పెద్ద చెరువు, జిన్నారం మండలం శివునిచెరువు, బొల్లారం దామరచెరువు, గుమ్మడిదల మండలం కానుకుంట చిన్న బ్రాహ్మణకుంట, సదాశివపేట మండలం మన్నెరానికుంట ఉన్నాయి. ఆయా చెరువుల, కుంటల కట్టలు కొట్టుకుపోవడంతో చాలావరకు నీళ్లు వృథాగా దిగువ ప్రాంతాలకు వెళ్లాయి. వీటి నిర్మాణం చేయాలంటే రూ.20 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 

Updated Date - 2020-10-31T06:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising