ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-12-13T05:52:27+05:30

ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్‌ రాజీవ్‌ రహదారిపై శనివారం జరిగింది.

ఆటోను ఢీకొట్టిన లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జంకి, డిసెంబరు 12: ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్‌ రాజీవ్‌ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని లాలాపేటకు చెందిన షేక్‌ హుస్సేన్‌ కుటుంబ సభ్యులు కరీంనగర్‌ మున్సిపల్‌ పరిధిలోని రేకుర్తిలో గారిమి పండుగకు హాజరై శనివారం కరీంనగర్‌ నుంచి ఆటోలో హైదరాబాద్‌కు బయలుదేరారు. గాగిళ్లాపూర్‌ రాజీవ్‌ రహదారి స్టేజి వద్ద రోడ్డు మరమ్మతులు జరుగుతుండడంతో వన్‌ వే ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న పాల ట్యాంకర్‌ ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న షేక్‌ నజీర్‌(25), యకుబి(12) మృతి చెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌ వే ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.


Updated Date - 2020-12-13T05:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising