ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుకాణాల కేటాయింపుపై ఆందోళన

ABN, First Publish Date - 2020-12-29T06:02:03+05:30

బస్టాండ్‌ సమీపంలో అత్యంత విలువైన రెండు దుకాణాలను బహిరంగ వేలం వేయకుండా అక్రమ దారిలో కేటాయించడంపై యువజన సంఘాల నాయకులు సోమవారం మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట యువజన సంఘాల బైఠాయింపు


మెదక్‌ మున్సిపాలిటీ, డిసెంబరు 28 : బస్టాండ్‌ సమీపంలో అత్యంత విలువైన రెండు దుకాణాలను బహిరంగ వేలం వేయకుండా అక్రమ దారిలో కేటాయించడంపై యువజన సంఘాల నాయకులు సోమవారం మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న దళితులకు గానీ, నిరుద్యోగులకు గానీ అవకాశం కల్పించకుండా ఓ పార్టీ నేతకు దుకాణాలను కేటాయించడంపై మండిపడ్డారు. మున్సిపల్‌ అధికారులు ప్రతిపాదన కలెక్టర్‌ గారికి పంపడంతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. దుకాణం కేటాయించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు కలెక్టర్‌కు ఎలా తెలుస్తాయని మున్సిపల్‌ అధికారుల అక్రమాలతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు కేటాయించాల్సిన దుకాణాలను ఓ ప్రజాప్రతినిధి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి డీఈ మహే్‌ష ఫోన్‌ ద్వారా యువజన సంఘాల నాయకులతో మాట్లాడి ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమాల్లో దళిత, యువజన సంఘాల నాయకులు రామస్వామి, బీముడు, బాలరాజు, భరత్‌గౌడ్‌, అమీర్‌, మన్సూర్‌అహ్మద్‌, సుశీల్‌, జక్కుల శేఖర్‌, జక్కుల రాజు, గుండు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T06:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising