ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం ఇవ్వలేదని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన వ్యక్తి

ABN, First Publish Date - 2020-12-11T06:21:09+05:30

సిద్దిపేట నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కోసం తన 25 గుంటల భూమిని తీసుకొని పరిహారం ఇవ్వలేదంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన వ్యక్తిని దించుతున్న పోలీసులు, ఆత్మహత్యకు ప్రయత్నించిన శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

25 గుంటల భూమిని డబుల్‌ ఇళ్లకు కేటాయించి న్యాయం చేయలేదని ఆత్మహత్యాయత్నం


సిద్దిపేట సిటీ, డిసెంబరు 10: సిద్దిపేట నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కోసం తన 25 గుంటల భూమిని తీసుకొని పరిహారం ఇవ్వలేదంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. గురువారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్‌ డబుల్‌ బెడ్రూం కాలనీలో సీఎం కేసీఆర్‌ ఇళ్లను ప్రారంభించి వెళ్లిపోగానే ఈ కాలనీ వద్దే నివాసం ఉంటున్న శ్రీనివాస్‌ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దూకే యత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు శ్రీనివాస్‌ను అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు వాటర్‌ట్యాంక్‌పైనే ఉండి తనకు న్యాయం చేయాలంటూ అరిచాడు. పోలీసులు ఎంత సర్దిచెప్పిన కిందికి దిగలేదు. అసహనానికి గురైన పోలీసులు సదురు వ్యక్తిని బలవంతంగా కిందకి దింపారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ నాలుగేళ్ల కింద తన 25 గుంటల భూమిని డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్నారని, నష్టపరిహారం ఇస్తామని చెప్పి తనను పక్కన పెట్టారని విలపించాడు. కనీసం డబుల్‌ బెడ్రూం కూడా ఇవ్వలేదని వాపోయాడు. పరిహారం ఇవ్వక, ఇల్లు ఇవ్వక అధికారులు అన్యాయం చేశారంటూ బోరుమన్నాడు. 

Updated Date - 2020-12-11T06:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising