ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే రంగనాయక సాగర్‌ ప్రారంభోత్సవం

ABN, First Publish Date - 2020-04-24T10:30:42+05:30

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను శనివారం ప్రారంభించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రయల్‌ రన్‌కు చంద్లాపూర్‌ పంప్‌హౌస్‌ సిద్ధం  

స్విచ్చాన్‌ చేయనున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌


చిన్నకోడూరు, ఏప్రిల్‌ 23 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను శనివారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. చంద్లాపూర్‌ గ్రామ ఇలవేల్పు అయిన రంగనాయకస్వామి పేరుపై నిర్మించిన రిజర్వాయర్‌ శరవేగంగా పూర్తి చేసుకొని సర్జ్‌పూల్‌ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమైంది.


ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌ అప్రోచ్‌ ఛానెల్‌ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌కి గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి 0.354 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్‌ ద్వారా 8.59 కిలోమీటర్ల సొరంగం మార్గం నుంచి చంద్ల్లాపూర్‌ సర్జ్‌పూల్‌కి (పంప్‌హౌజ్‌) నీళ్లు చేరుకున్నాయి. పంప్‌హౌ్‌సలో ఏర్పాటు చేసిన 135 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు మోటార్ల ద్వారా 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయక సాగర్‌లోకి నీటిని ఎత్తి పోయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ మహత్తర కార్యాన్ని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించనున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్షా పదివేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. దీంతో రైతాంగంలో సంతోషం వెల్లివిరుస్తుంది.


సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌డేవిస్‌ గురువారం రిజర్వాయర్‌ను సందర్శించారు. ప్రాజెక్టులోనికి నీళ్లు వచ్చే టన్నెల్‌, ప్రాజెక్టు నిండిన తర్వాత బయటకు నీళ్లు వెళ్లే టన్నెల్‌ ప్రదేశాలను పరిశీలించారు. పార్కింగ్‌ చేసే ప్రదేశాలను పరిశీలించారు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌, సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డికి భద్రత, పార్కింగ్‌కు సూచనలు చేశారు.

Updated Date - 2020-04-24T10:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising