ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు : ఎస్పీ

ABN, First Publish Date - 2020-05-31T09:59:18+05:30

పోలీసు సిబ్బంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను అందజేస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి క్రైం, మే 30 : పోలీసు సిబ్బంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను అందజేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ మాత్రలను ఎవరు వేసుకోవాలి ? ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఈ మాత్రలను వేసుకోకూడదు ? అనే విషయాలన్నీ తెలియజేసేందుకు సంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ల ఎస్‌ఐ, సీఐలతో సంగారెడ్డి జిల్లా పోలీసు కల్యాణ మండపంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 400 ఎంజి (200 ఎంజి మాత్రలు రెండు) హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ మాత్రలను దీర్ఘకాలిక వ్యాధులు లేని పోలీస్‌ సిబ్బంది వారానికి ఒకటి చొప్పున ఏడు వారాల పాటు వేసుకోవాలని సూచించారు.


మొదటి వారం ఈ మాత్రలను ఉదయం, రాత్రి సమయాల్లో ఆహారం తిన్న తర్వాత వేసుకోవాలని చెప్పారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ మాత్రలను వేసుకోవద్దని సూచించారు. కరోనా నివారణ చర్యలతో పాటు నేరాల నిరోధం, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలీ్‌సస్టేషన్‌కు చేతులను శుభ్రం చేసుకోడానికి ఒక స్టాండ్‌ను, థర్మల్‌ స్కానర్‌ను అందజేస్తామని తెలిపారు. 


పోలీ్‌సస్టేషన్‌లలో 55 సంవత్సరాలు పై బడిన వారికి కరోనా వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా వుండటం వల్ల వారికి పోలీ్‌సస్టేషన్‌లోనే తగిన విధుల్లో వుంచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సృజన, సీఐ శ్రీనివాస్‌ నాయుడు, డీసీఆర్‌బీ సీఐ రామకృష్ణారెడ్డి, ఐటీ కోర్‌ టీం సీఐ హేమరాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-31T09:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising