ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యవంతమైన నారే మేలు

ABN, First Publish Date - 2020-07-09T11:50:05+05:30

ఆరోగ్యవంతమైన వరినారు మళ్లతోనే పంటలకు మేలని తోర్నాల వ్యవసాయ పరిశోధనా సంస్థ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణరావుపేట, జూలై 8 : ఆరోగ్యవంతమైన వరినారు మళ్లతోనే పంటలకు మేలని తోర్నాల వ్యవసాయ పరిశోధనా సంస్థ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏవీ రామాంజనేయులు రైతులకు సూచించారు. బుధవారం నారాయణరావుపేట మండలంతో పాటు ఇబ్రహీంపూర్‌లో వరినారు మళ్లను పరిశీలించి మాట్లాడారు. మెరుగైన నారు తయారీ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నారుమడిలో నారు కుళ్లిపోవడం, వాసన రావడంతో పాటు మొలకెత్తిన విత్తనాలు సరిగ్గా పెరగకపోవడం వంటి సమస్యలు వస్తాయన్నారు.


ముఖ్యంగా నారు మడిలో అధిక నీరు నిల్వ ఉండకూడదని చెప్పారు. నారుమడికి సాయంత్రం నీళ్లు ఇచ్చి మరుసటిరోజు ఉదయం తీసేయాలని సూచించారు. రెండు కిలోల డీఏపీ, ఒక కిలో యూరియా, ఒక కిలో పొటాష్‌ నారుమళ్లలో చల్లుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త శ్రీనివాస్‌, వ్యవసాయాధికారి విద్యాకర్‌రెడ్డి, సర్పంచ్‌ దేవయ్య, ఏఈవో నాగార్జున్‌, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T11:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising