ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పతుల పెత్తనం ఇక చెల్లదు

ABN, First Publish Date - 2020-08-22T10:42:58+05:30

ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పెత్తనంపై ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి సారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారిక కార్యక్రమాల్లో మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ 

జీవో జారీ చేసిన ప్రభుత్వం


మెదక్‌ మున్సిపాలిటీ, ఆగస్టు 21: ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పెత్తనంపై ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి సారించింది. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుల స్థానంలో కుటుంబ సభ్యులు పాల్గొంటే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టంపై ఈ నెల 16న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాల్లోనూ మహిళా కౌన్సిలర్లకు బదులుగా ఇతరులు హాజరైతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చట్టంలో హెచ్చరించింది. పాల్గొన్న కుటుంబ సభ్యులపై క్రిమినల్‌ కేసులు తప్పవని చట్టంలో స్పష్టం చేసింది. ఇందుకు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 


జిల్లా కేంద్రంలో 18 మంది.

మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులుండగా మున్సిపల్‌ ఎన్నికల్లో 18 మంది మహిళా కౌన్సిలర్లు ఎన్నుకోబడ్డారు. కానీ జిల్లా కేంద్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలే హాజరవుతున్నారు. మహిళలకు అన్నింటా సమానమైన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మహిళలకు సగం స్థానాలు కేటాయించినా కుటుంబ సభ్యుల పెత్తనమే కొనసాగుతున్నది. గత నెలలో జరిగిన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశానికి కేవలం ముగ్గురు మహిళా కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఓ వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్‌ స్థానంలో భర్త హాజరుకావడంతో సొంత పార్టీ కౌన్సిలర్లే నిలదీశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో మేరకు ఇకపై మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబ సభ్యులు హాజరుకావడం ఇకపై కుదరదు.

Updated Date - 2020-08-22T10:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising