ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా వేతనంలో నుంచి గొర్రెల కాపర్ల సంక్షేమానికి ఇస్తా

ABN, First Publish Date - 2020-12-02T05:19:05+05:30

దుబ్బాక, డిసెంబరు 1 : తనకు వచ్చే వేతనంలో నుంచి కొంత వరకు ప్రతీనెల గొర్రెల కాపర్ల సంక్షేమానికి వినియోగిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రకటించారు.

గొర్రెకు నట్టల నివారణ మందును వేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతీ నెలా పశువైద్యాధికారులకు చెల్లింపు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, డిసెంబరు 1 : తనకు వచ్చే వేతనంలో నుంచి కొంత వరకు ప్రతీనెల గొర్రెల కాపర్ల సంక్షేమానికి వినియోగిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రకటించారు. వాటిని గొర్రెలకు వేసే టీకాలు, వివిధ వ్యాధుల నుంచి రక్షణకు వినియోగించేందుకు ఉపకరిస్తానని ఆయన చెప్పారు. మంగళవారం చిట్టాపూర్‌లో గొర్రెలకు నట్టల నివారణ టీకాలను ఆయన వేశారు. పశు వైద్యశాలల్లో మందులు లేవనే పదం వినపడవద్దని, పేదలను సిద్దిపేటలోని ప్రైవేటు మందుల దుకాణాల చుట్టూ తింపవద్దన్నారు. మందుల కొనుగోలుకు తన వేతనంలో నుంచి నెలనెలా కొంత చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చిట్టాపూర్‌ గ్రామంలోని పెద్దచెరువును పరిశీలించారు. 

Updated Date - 2020-12-02T05:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising