ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల హల్‌చల్‌

ABN, First Publish Date - 2020-07-01T11:53:40+05:30

సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లమని ఇద్దరు గుర్తతెలియని వ్యక్తులు హల్‌చల్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగిపేట, జూన్‌ 30: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లమని ఇద్దరు గుర్తతెలియని వ్యక్తులు హల్‌చల్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్షసాక్షులు, సంగారెడ్డి డివిజన్‌ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రావు కథనం ప్రకారం సోమవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు పట్టణంలోని పలు బేకరీలకు వెళ్లి ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లుగా పరిచయం చేసుకున్నారు. దకాణాల లైసెన్సులు రెన్యూవల్‌ చేసుకోవాలని, రూ. 6 వేలు చెల్లిస్తే లైసెన్సులు వాట్సా్‌పలో పంపుతామని పేర్కొన్నారు. అనుమానం వచ్చిన యజమానులు డబ్బులు రేపు ఇస్తామని చెప్పారు. అనంతరం కిరాణా అండ్‌ జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకుడికి సమాచారమిచ్చారు.


సంగారెడ్డిలోని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రావును సంప్రదించగా.. తామెవరినీ పంపలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన సూచన మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నకిలీ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల  ఫొటోలను పోలీసులకు అందజేశారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లమని ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే 9885687765 నంబర్‌లో తనకు సమాచారందించాలని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రావు కోరారు.

Updated Date - 2020-07-01T11:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising