ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమి కబ్జాకు విఫలయత్నం

ABN, First Publish Date - 2020-11-21T06:03:50+05:30

రామచంద్రాపురం మండలం వెలిమెలలో రూ.6 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేయడానికి యత్నించారు.

ప్రభుత్వ భూమిలో నిర్మాణాన్ని తొలగింపజేస్తున్న వీఆర్వో రాజమల్లేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రాపురం, నవంబరు 20: రామచంద్రాపురం మండలం వెలిమెలలో రూ.6 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేయడానికి యత్నించారు. ప్రభుత్వ సర్వే నంబరు 369లో ఓ వ్యక్తి సుమారు 20 గుంటల స్థలాన్ని చదును చేసి హద్దులు పాతేందుకు సిద్ధపడ్డాడు. సర్వే నంబరు 315లో సుమారు రూ.30 లక్షల విలువ చేసే భూమిలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. విషయాన్ని స్థానికులు వీఆర్‌వో రాజమల్లేశం దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్‌ కె.శివకుమార్‌ ఆదేశాల మేరకు రాజమల్లేశం శుక్రవారం ఆ భూములను గుర్తించారు. సిబ్బందితో వెళ్లి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి యత్నించిన వారి విషయంలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.

Updated Date - 2020-11-21T06:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising