ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఇంటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకూ సాగు నీరే లక్ష్యం

ABN, First Publish Date - 2020-09-25T06:13:52+05:30

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకూ సాగు నీరు అందించడమే సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపోల్‌, సెప్టెంబరు 24 : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకూ సాగు నీరు అందించడమే సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం రాయపోల్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మతో కలిసి 266 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను అందచేశారు. నూతన రెవెన్యూ బిల్లుకు మద్దతుగా రైతులు చేపట్టిన భారీ ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లను బిగించాలంటే బీజేపీకి ఓటు వేయండి.. వద్దంటే టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.


బీజేపీ రైతు వ్యతిరేక చట్టాన్ని అమలు చేస్తున్న విధానం నచ్చక కేంద్ర మంత్రి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు, 1బీల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఉండేందుకే కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. మండలంలో క్లియరెన్స్‌ చేయని 1,295 పట్టాదారు పాసు పుస్తకాలను త్వరితగతిన క్లియరెన్స్‌ చేసి రైతులకు అందివ్వాలని ఆర్డీవోను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ అనిత, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, సర్పంచ్‌ మౌనిక, ఎంపీటీసీ యాదమ్మ కో ఆప్షన్‌ సభ్యుడు పర్వేజ్‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T06:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising