ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదు

ABN, First Publish Date - 2020-05-09T09:54:48+05:30

రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకవచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌


హుస్నాబాద్‌, మే 8 : రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకవచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌ నాయకులకు ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ హితవు పలికారు. కోహెడ మండలం బస్వాపూర్‌ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ చేసిన విమర్శలను ఖండించారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.


క్షేత్రస్థాయిలో తిరిగితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ గురించి ఆలోచించిందా అని ప్రశ్నించారు. సాగుకు గోదావరి నీళ్లు తీసుకవచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతులకు కాంగ్రెస్‌ పాలనలో రైతులు అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్నారనేది గుర్తు చేసుకోవాలన్నారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.


ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చెర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అనిత, ఎంపీపీలు మానస, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T09:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising