ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరిసిల్ల జిల్లాలో పది మందికి పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-08-03T19:37:44+05:30

జిల్లాలో ఆదివారం పది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం పది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సిద్దిపేట పట్టణంలో ఆరుగురు, చేర్యాలలో ఒకరు, మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌లో ఇద్దరు, బెజ్జంకిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 


కరోనాతో చేర్యాల వాసి మృతి

చేర్యాల పట్టణ శివారులోని గుంటూరుపల్లి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిరోజులక్రితం అనారోగ్యానికి గురైన ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా ఆస్పత్రి నిర్వాహకులు అంత్యక్రియలను అక్కడే నిర్వహించారు. చేర్యాలలో కరోనాతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. చేర్యాలలోని పెట్రోల్‌పంప్‌ సమీపంలో ఓ మహిళకు పాజిటివ్‌ రావడంతో ఆదివారం స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు సర్వే చేపట్టారు. పాజిటివ్‌ వచ్చిన మహిళకు సంబంధించిన 11 మంది ప్రైమరీ కాంటాక్టు, నలుగురి సెకండరీ కాంటాక్టులను గుర్తించి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు హెల్త్‌ ఎడ్యూకేటర్‌ మురళి తెలిపారు. కాలనీలో మున్సిపల్‌ సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు.

Updated Date - 2020-08-03T19:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising