ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరవేగంగా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-07-03T11:27:45+05:30

సిద్దిపేట జిల్లాలో రైతువేదిక నిర్మాణాలను శరవేగంగా జరపాలని గుత్తేదార్లను కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట సిటీ, జూలై 2: సిద్దిపేట జిల్లాలో రైతువేదిక నిర్మాణాలను శరవేగంగా జరపాలని గుత్తేదార్లను కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయంలో అడిషనల్‌ కలెక్టర్లు పద్మాకర్‌, ముజామిల్‌ఖాన్‌, డీఏవో శ్రవణ్‌తో కలిసి రైతువేదిక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్లస్టర్ల వారీగా రైతువేదిక, ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు,  గ్రేవ్‌యార్డు నిర్మాణాలకు ఎంతమేర ఇసుక అవసరమో ప్రతిపాదనలు ఇస్తే త్వరితగతిన పంపిణీ చేసే లా ఏర్పాట్లు చేస్తామని గుత్తేదార్లకు సూచించారు. డంపింగ్‌యార్డు, గ్రేవ్‌యార్డులు, రైతువేదికల నిర్మాణాలపై క్లస్టర్ల వారీగా చర్చించారు. అనుకున్న సమయంలోపు నిర్మాణాలు పూర్తిచేసి జిల్లాను అగ్రభాగాన నిలపాలని కోరారు. 


ఆడిట్‌ అంశంపై సమీక్ష 

ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిరూపాయిపై ఆడిట్‌ జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. 4 నెలల పాటు జరగనున్న ఇంటర్నల్‌ ఆడిట్‌కు బ్యాంకర్లు, రిటైర్డు అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌శాఖ ఎస్‌ఈ కనకరత్నం, డీఆర్డీఏ పీడీ గోపాల్‌ రావు, డీపీవో సురేశ్‌బాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-03T11:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising