ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుద్దెడలో ఘనంగా బోనాల పండుగ

ABN, First Publish Date - 2020-11-23T06:40:05+05:30

మండలంలోని దుద్దెడ గ్రామంలో ఆదివారం ఆరె క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు.

దుద్దెడలో బోనాల ఊరేగింపులో మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొండపాక, నవంబరు 22:  మండలంలోని దుద్దెడ గ్రామంలో ఆదివారం ఆరె క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో గ్రామంలోని ఊర పోచమ్మ, దూసకుంట నల్ల పోచమ్మ దేవతలకు బోనాలను ఆనవాయితీగా సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరె కులస్థులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువకుల చిందులు, బాణాసంచాల మోతతో గ్రామంలో బోనాల పండుగ కనుల పండువగా సాగింది. కార్యక్రమంలో ఎంపీటీసీ గురజాడ బాలాజి, ఆరె క్షత్రియ సంఘం నాయకులు దొడ్ల రమేష్‌, శివాజీగారి బాల్‌రెడ్డి కుసుంబ నర్సింగరావు, బూర్గుల వెంకటరమణ, కనకారావు, కృష్ణ, హరికిషన్‌, దొడ్ల వెంకటేశం, మల్లేశం, కనకయ్య  పాల్గొన్నారు.



Updated Date - 2020-11-23T06:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising