ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-09-25T06:14:38+05:30

రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో వ్యవసాయ కార్పొరేటీకరణ బిల్లును ప్రవేశపెట్టిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దౌల్తాబాద్‌, సెప్టెంబర్‌ 24: రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో వ్యవసాయ కార్పొరేటీకరణ బిల్లును ప్రవేశపెట్టిందని, ఆ బిల్లుతో జమీందారు వ్యవస్థకు జీవం పోయనున్నదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో 504 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షానికి ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు చెక్కులను పంపిణీ చేశారు.


టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌ దౌల్తాబాద్‌లో గ్రంథాలయం ఏర్పాటుకు విరాళం అడగగా తక్షణ సహాయం కింద 25 లక్షలు మంజూరు పత్రాన్ని అందిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, జడ్పీటీసీ రణం జ్యోతి, ఎంపీపీ గంగాధర్‌ సంధ్య, కో ఆప్షన్‌ సభ్యుడు రహీమోద్దీన్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివా్‌సగుప్తా, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటరెడ్డి, సర్పంచ్‌ ఆది వెంకన్న, నాయకుడు మాదాసు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T06:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising