ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు సార్లు గెలిచినా..ఐదేళ్ల పదవికి సోలిపేట దూరం

ABN, First Publish Date - 2020-10-01T09:53:30+05:30

దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగుసార్లు గెలుపొంది చట్ట సభల్లోకి అడుగుపెట్టినా ఏ టర్మ్‌లో కూడా పూర్తిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక, సెప్టెంబరు 30: దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగుసార్లు గెలుపొంది చట్ట సభల్లోకి అడుగుపెట్టినా ఏ టర్మ్‌లో కూడా పూర్తిగా ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం దక్కలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో విభేదం వల్ల ఓసారి, ముందస్తు ఎన్నికల వల్ల రెండోసారి ఆయన ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా 2018లో గెలిచి, ఈ దఫా అయినా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటానని ఆశించినా విధి అందుకు సహకరించలేదు. రామలింగారెడ్డి తొలుత 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.


పదవీకాలం పూర్తికాకుండానే.. 2008లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో విభేదించిన టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులందరి చేతా రాజీనామా చేయించారు. ఆ వెంటనే ఉప ఎన్నికలు జరిగాయి. ఈ దఫా రామలింగారెడ్డి గెలిచారు. మళ్లీ ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఆయన ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందినా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసే అవకాశం దక్కలేదు. నాలుగేళ్లలోపే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తిరిగి 2018 ఎన్నికల్లో గెలిచినా అకాల మరణంతో ఐదేళ్ల పదవీకాలానికి నోచుకోలేకపోయారు.  

Updated Date - 2020-10-01T09:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising