మట్టిని తరలిస్తున్న 3 టిప్పర్లు, ఎక్స్‌కవేటర్ సీజ్
ABN, First Publish Date - 2020-12-15T05:36:11+05:30
అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ను రెవెన్యూ అధికారులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు.
కంది, డిసెంబరు 14 : అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ను రెవెన్యూ అధికారులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. కంది మండలంలోని చేర్యాల గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలం సర్వే నంబరు 268లో కొందరు దళారులు అక్రమంగా మట్టి తవ్వకాలకు ప్రయత్నించారు. వెంటనే స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. కంది తహసీల్దార్ పరమేశం ఆదేశాల మేరకు ఆర్‌ఐ నవనీత సిబ్బందితో కలసి వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకుని 3 టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్లు, ఎక్స్‌కవేటర్‌ను చేర్యాల గ్రామ పంచాయతీ వద్దకు తరలించి విచారణకు ఆదేశించారు. మండలంలో ఎవరైనా అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని తహసీల్దార్ హెచ్చరించారు.
Updated Date - 2020-12-15T05:36:11+05:30 IST