ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టు అణచివేతలో జిల్లాకు మొదటి స్థానం

ABN, First Publish Date - 2020-12-31T05:02:02+05:30

మావోయిస్టు అణచివేతలో జిల్లాకు మొదటి స్థానం

హైదరాబాద్‌లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి రివార్డును అందజేస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో మావోయిస్టుల అణచివేతలో మానుకోట జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లా పోలీస్‌ అధికారులను అభినందించారు.  రాష్ట్రంలో మహబూబాబాద్‌ జిల్లాగా ఆవిర్భవించాక ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టి సారించారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవమని పిలుపునిచ్చి వారి కుటుంబాలను కలుస్తూ తోడుగా నిలుస్తూ వస్తున్నారు. మానుకోట జిల్లాలో ఐదు దళాలను పట్టుకోవడంతో పాటు ప్రత్యేక నిఘాతో ఎక్కడిక్కడ మావోయిస్టు కార్యకలాపాలను అణచివేస్తున్నారు. ఎలాంటి అసాంఘిక చర్యలకు తావులేకుండా శాంతిస్థాపనకు కృషి చేశారు. ఇందుకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, బృందానికి రివార్డును ప్రకటించారు. హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డికి డీజీపీ మహేందర్‌రెడ్డి రివార్డును అందించి అభినందించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పాటు పడుతానని ఎస్పీ స్పష్టం చేశారు. మానుకోట డీఎస్పీ ఆంగోతు నరే్‌షకుమార్‌, సీఐలు తిరుపతి, సతీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising