అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్
ABN, First Publish Date - 2020-12-12T04:27:53+05:30
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్
పెద్దవంగర, డిసెంబరు 11: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల పట్ల అలసత్వ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని సేకరించాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు గ్రామాల్లో సిగ్రిగేషన్ షెడ్స్, పల్లెప్రకృతి వనాలు, శ్మశానవాటిలు, నర్సరీ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాఽధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాల ని, క్షేత్రస్థాయిలో అధికారులు పనుల పట్ల నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు వంద రోజులు పని కల్పించే విధంగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. కార్యదర్శు లు నిత్యం గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఎంపీపీ ఈ దురు రాజేశ్వరి, తహసీల్దార్ కూర్మ యోగేశ్వర్‌రావు, ఎంపీడీవో అప ర్ణ, పీఆర్‌డీఈ ప్రసన్నకుమార్, డీపీఆర్‌వో శ్రీనివా్‌సరావు, పీఆర్ ఏ ఈలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు సురేష్, యాకుబ్, మండల ప్రత్యేకాధికారి రాజు, ఎంపీవో యాకయ్య, ఏసీవో బీమ్లానాయక్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏదునురి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య, ఆర్‌ఐ అశోక్, యాకయ్య, సురేష్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ టౌన్ : నర్సరీల్లో పెంచే మొక్కలు పెరిగేందుకు మెళకువలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వీపీగౌతమ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మొక్కల పెంపకంపై అటవీశాఖ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 461 గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం జరుగుతోందని చెప్పారు. అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్, డీఎ్‌ఫవో రవికిరణ్, జడ్పీ సీఈవో సన్యాసయ్య, డీపీవో లత, డీఆర్‌డీఏ ఏపీడీ దయాకర్, మునిసిపల్ కమిషనర్ రవీందర్, ఎఫ్‌డీవో కృష్ణమాచారి పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:27:53+05:30 IST