ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో 60 స్మశాన వాటికల అభివృద్ధి- మేయర్‌ రామ్మోహన్‌

ABN, First Publish Date - 2020-07-14T01:22:35+05:30

జంటనగరాల్లో 60 స్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్‌ఎంసి చర్యలు తీసుకుంటున్నట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జంటనగరాల్లో 60 స్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్‌ఎంసి చర్యలు తీసుకుంటున్నట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం ప్రభుత్వ విప్‌, శాసన సభ్యులు అరికెపూడి గాంధీతో కలిసి మల్కంచెరువు సుందరీకరణలో భాగంగా చెరువు వెనకవైపు 100 అడుగుల వెడల్పుతో విస్తరించనున్న రోడ్డు ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ప్రతిపాదితరోడ్డు విస్తరణకు హౌసింగ్‌బోర్డు భూమికి మధ్య ఉన్న స్మశాన వాటికను మేయర్‌ పరిశీలించారు. ఈ స్మశాన వాటికకు అందుబాటులో ఉన్న జీహెచ్‌ఎంసి భూమిని కొంత కలపడంతో పాటు హౌసింగ్‌బోర్డు స్థలానికి హద్దులు నిర్ధారించి ప్రహారీ గోడను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.


స్మశాన వాటికకు విద్యుత్‌ లైటింగ్‌, తాగునీరు సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. అదే విధంగా సమీపంలో ఉన్నకాలనీ వాసుల సౌకర్యార్ధం రెండు అంతర్గత రోడ్లను, ఒక నాలాను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. భవిష్యత్‌ అవసరాల నిమిత్తం 100ఫీట్ల రోడ్లు నిర్మాణానికి సహకరించాలని బస్తీవాసులను కోరారు. ఈ అంశంలో బస్తీవాసులు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. 

Updated Date - 2020-07-14T01:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising