ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారిషస్‌ పోలీసు అధికారులకూ మనవద్దే శిక్షణ

ABN, First Publish Date - 2020-02-22T08:27:31+05:30

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రం(ఎన్‌పీఏ).. ప్రపంచస్థాయి పోలీసు శిక్షణలో పేరుగాంచిన విఖ్యాత సంస్థ. ఇప్పటివరకు ఐపీఎ్‌సకు ఎంపికైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికే ఈ జాబితాలో నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు

జాతీయ పోలీసు అకాడమీలో 229 మంది ఐపీఎస్‌లకు శిక్షణ 


హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రం(ఎన్‌పీఏ).. ప్రపంచస్థాయి పోలీసు శిక్షణలో పేరుగాంచిన విఖ్యాత సంస్థ. ఇప్పటివరకు ఐపీఎ్‌సకు ఎంపికైన వారితో పాటు పొరుగుదేశాలు నేపాల్‌, భూటాన్‌, మాల్దీవుల పోలీసు అధికారులకూ ఇక్కడ శిక్షణ అందించేవారు. తాజాగా ఈ జాబితాలో మరో పొరుగుదేశం మారిషస్‌ కూడా చేరింది. 2019 సంవత్సరంలో ఎంపికైన 72-ఆర్‌ఆర్‌ బ్యాచ్‌కు చెందిన 229 మంది ఐపీఎ్‌సలకు కొద్ది రోజుల క్రితం ఎన్‌పీఏలో శిక్షణ ప్రారంభమైంది. వీరితో పాటు నేపాల్‌(5), భూటాన్‌(6), మాల్దీవులు(5), మారిష్‌స(4)లకు చెందిన 20 మంది విదేశీ పోలీసు అధికారులూ శిక్షణ పొందుతున్నారు. కాగా, 71 ఆర్‌ఆర్‌ బ్యాచ్‌లో కేంద్రం తెలంగాణకు 11 మంది ఐపీఎ్‌సలను కేటాయించగా, వారంతా పోస్టింగ్‌లు ఇచ్చిన జిల్లాల్లో రెండో దశ శిక్షణలో ఉన్నారు. ఒకేసారి 11 మంది ఐపీఎ్‌సలను ఒక రాష్ట్రానికి కేటాయించడం ఇదే తొలిసారి. కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో 72 ఆర్‌ఆర్‌ బ్యాచ్‌లోనూ తెలంగాణకు భారీగానే ఐపీఎ్‌సలను కేటాయించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-02-22T08:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising