ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లిళ్లు వాయిదా

ABN, First Publish Date - 2020-03-23T09:15:00+05:30

జనతా కర్ఫ్యూతో రాష్ట్రంలో పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. ఇంకొందరు ముహూర్తానికి ఒక రోజు ముందు శనివారమే వివాహం జరిపించారు. శుక్రవారం పెళ్లయి.. ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని ముహూర్తానికి ముందే

నల్లగొండ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూతో రాష్ట్రంలో పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. ఇంకొందరు ముహూర్తానికి ఒక రోజు ముందు శనివారమే వివాహం జరిపించారు. శుక్రవారం పెళ్లయి.. ఆదివారం ఏర్పాటు చేసుకున్న రిసెప్షన్‌ వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించిన వధూవరులను, పెళ్లి పెద్దలను పలువురు అభినందించారు. జనతా కర్ఫ్యూ గురించి అధికారులు  వెళ్లి వివరించడంతో పెద్దపల్లి జిల్లా ముత్తారంలో ఆదివారం జరగాల్సిన పెళ్లిని సోమవారానికి వాయిదా వేయడానికి వధూవరుల తల్లిదండ్రులు అంగీకరించారు.


నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం జరగాల్సిన పెళ్లిని ఆర్భాటంలేకుండా శనివారమే జరిపించారు. ఇదిలా ఉండగా ఒకటిరెండు చోట్ల జనతా కర్ఫ్యూలోనూ పెళ్లిళ్లు ఆగలేదు. ఫంక్షన్‌ హాల్‌ మూతపడడంతో మహబూబాబాద్‌ జిల్లా కే.సముద్రం మండలం అమినాపురంలో ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి పెళ్లి చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో మండలం తిగుల్‌ నర్సాపూర్‌లోనూ ఓ పెళ్లి జరిగింది. కేవలం 50 మందే హాజరయ్యారు.

Updated Date - 2020-03-23T09:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising