ఏ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పండి?
ABN, First Publish Date - 2020-10-01T08:48:26+05:30
కొవిడ్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తే ఏం ప్రభావం ఉంటుంది?....
ఎన్నికల కమిషనర్‌కు మర్రి శశిధర్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కొవిడ్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తే ఏం ప్రభావం ఉంటుంది? అన్న అంశాలను శాస్త్రీయంగా వివరించాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి బుధవారం ఆయన లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పద్ధతిని అనుసరించాలన్న దానిపై అభిప్రాయం చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. గడువు ముగియనున్న నేపథ్యంలో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ బుధవారం గాంధీ భవన్‌లో సమావేశమైంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల కమిషనర్‌కు మర్రి శశిధర్‌రెడ్డి లేఖ రాశారు.
Updated Date - 2020-10-01T08:48:26+05:30 IST