ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ కార్మికుల ప్లాట్‌లలో అవకతవకలు

ABN, First Publish Date - 2020-06-18T09:59:31+05:30

చిత్రపురిలో ప్రభుత్వం కేటాయించిన 4213 ప్లాట్‌లలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని చిత్రపురి సాధన సమితి డిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్రపురి భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: సంఘం 


నల్లకుంట, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): చిత్రపురిలో ప్రభుత్వం కేటాయించిన 4213 ప్లాట్‌లలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని చిత్రపురి సాధన సమితి డిమాండ్‌ చేసింది. సినీ కార్మికుల కష్టాన్ని దోచుకున్న వారిని అరెస్ట్‌ చేయడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేయాలని పేర్కొంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. బుధవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రపురి సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ కస్తూరి శ్రీనివాస్‌, వర్సింగ్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ భద్ర, ప్రధాన కార్యదర్శి బీ నర్సింహారెడ్డి మాట్లాడారు. 1994లో ఏపీ సినీ వర్కర్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటి లిమిటెడ్‌ ద్వారా సినీ కార్మికులకు మణికొండలోని చిత్రపురిలో 67.16 గుంటల స్థలాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచే శారు.


అయితే ఆ స్థలాన్ని సరైన సమయంలో స్వాధీనపరచుకోలేదన్నారు. అయినా 2005లో కూడా గజం 40 రూపాయలకు స్వాధీనపరచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. తర్వాత కొంత మంది సొసైటీ ప్రతినిధులు నిజమైన సినీ కార్మికులకు కాకుండా తమ పలుకుబడితో ఇతరులకు సినీ గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి ఇళ్లను అప్పగించారని ఆరోపించారు. మొత్తం 4213 ప్లాట్‌లలో సినీ కార్మికులను విస్మరించి 75ు ఇతరులకు కేటాయించారన్నారు. ఈ అంశంపై సీబీఐతో వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.  .  

Updated Date - 2020-06-18T09:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising