ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాణిక్యాలరావు మృతి దిగ్భ్రాంతిని కలిగించింది: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-08-02T00:26:46+05:30

మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ‘‘నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి పని చేశాను. మంచి స్నేహశీలి.. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా పనిచేశారు. మాణిక్యాలరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాను’’ అని కిషన్‌రెడ్డి ప్రకటించారు.


మాణిక్యాలరావు కరోనా వల్ల కన్నుమూసిన విషయం తెలిసిందే. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత, చంద్రబాబు కేబినెట్‌లో బీజేపీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014 నుంచి 2018 వరకూ ఆయన మంత్రిగా పనిచేశారు.

Updated Date - 2020-08-02T00:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising