తెలంగాణలో కొత్త కాంగ్రెస్‌ని చూడబోతున్నారు: మాణిక్కం ఠాగూర్
ABN, First Publish Date - 2020-11-03T19:59:29+05:30
మహబూబ్‌నగర్: ఇక మీదట తెలంగాణలో కొత్త కాంగ్రెస్‌ని చూడబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్: ఇక మీదట తెలంగాణలో కొత్త కాంగ్రెస్‌ని చూడబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ 2023 లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకుపోతోందన్నారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతి, గవర్నర్‌కి అందిస్తామని ఠాగూర్ వెల్లడించారు. కేసీఆర్.. మోదీ సర్కార్‌కి భయపడుతున్నారని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు.
Updated Date - 2020-11-03T19:59:29+05:30 IST