ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంద కృష్ణకు పిచ్చెక్కింది: పిడమర్తి

ABN, First Publish Date - 2020-09-25T07:02:55+05:30

ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు పిచ్చెక్కిందని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి ఆరోపించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు24 (ఆంధ్రజ్యోతి): ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు పిచ్చెక్కిందని  ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేేస్త, ఆ అధికారం రాష్ర్టానికి లేదని సుప్రీం కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఇక్కడ ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాదిగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో పిడమర్తి మాట్లాడారు.  పార్లమెంటులో చట్టం ద్వారానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యం అవుతుందన్నారు.   మాదిగలకు అన్యాయం జరిగిందని, రావలసినన్ని ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంఎ్‌సఎస్‌ అధ్యక్షుడు గడ్డి యాదయ్య, ఇటుక రాజు, బీజేపీ నేత గద్దల అంజిబాబు తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T07:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising