కేసీఆర్‌వి పిట్టలదొర మాటలు
ABN, First Publish Date - 2020-12-15T05:08:48+05:30
కేసీఆర్‌వి పిట్టలదొర మాటలు
తీన్మార్ మల్లన్న
పాలకుర్తి, డిసెంబరు 14: ముఖ్య మంత్రి కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విమర్శించారు. ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం రాత్రి మండలంలోని వావిలాల, మల్లంపల్లి, దర్దెపల్లి గ్రామాల మీదుగా పాలకుర్తికి చేరు కుంది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చౌరస్తాలో ఆయనకు స్థానిక యువకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరు ప్రశ్నిం చే గొంతుక కావాలని, ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీయాలని సూచించారు. తెలంగాణలో రైతులను, నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కేసీఆర్ మఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఏడేళ్లు కావస్తున్నా ఉద్యోగా లు ఇవ్వకుండా పిట్టల దొరలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్‌ంసీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని, ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనంత రం సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమా లలు వేశారు.
Updated Date - 2020-12-15T05:08:48+05:30 IST