బీజేపీ విజయోత్సవాలు
ABN, First Publish Date - 2020-12-06T03:44:56+05:30
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజే పీ నాయకులు బాణసంచా కాల్చి విజయోత్సవాలు నిర్వహించారు.
కందనూలు, డిసెంబరు 5: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజే పీ నాయకులు బాణసంచా కాల్చి విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు స్వీట్లు పంచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజావర్దన్‌రెడ్డి, జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అపర్ణరెడ్డి, జిల్లా మహిళా నాయకు రాలు రాధారెడ్డి, ఇందిరమ్మ, జిల్లా కార్యాలయ సంయుక్త కార్యదర్శి చందు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీశైలం, నాగర్‌కర్నూ ల్ మండలాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, రాము, తిరుపతిరెడ్డి, లక్ష్మయ్య, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, ప్రవీణ్, పి.లక్ష్మయ్య, చందు, నాని, ప్రవీణ్, భరత్, నరేందర్, అంజి, రాము పాల్గొన్నారు.
Updated Date - 2020-12-06T03:44:56+05:30 IST