ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి
ABN, First Publish Date - 2020-12-02T03:09:33+05:30
ట్రాక్టర్ డీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మిట్ట సదగోడులో మం గళవారం రాత్రి చోటుచేసుకున్నది.
వంగూర్, డిసెంబరు 1: ట్రాక్టర్ డీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మిట్ట సదగోడులో మం గళవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై బాలకష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యనారాయణ(68) తన ఇంటి ముందు అరుగుపై కూర్చొని ఉండగా చెక్‌డ్యాంకు సంబంధించిన కాంట్రాక్టర్ ట్రాక్టర్ అదుపు తప్పి అతడిపై దూసుకొచ్చింది. తీవ్ర గాయాలు కాగా కల్వకుర్తికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదుచేశామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Updated Date - 2020-12-02T03:09:33+05:30 IST