ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెడతా

ABN, First Publish Date - 2020-10-25T06:03:16+05:30

తెలంగాణ రాష్ర్టాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబడెతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 24 : తెలంగాణ  రాష్ర్టాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబడెతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కొత్తచెరువులో శనివారం మంత్రి బోట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త చెరువు మూడు దశాబ్దాల తరువాత పూర్తి స్థాయిలో నిండి, అలుగు పారుతోందన్నారు. రెండు కొండల నడుమ ఉన్న ఈ చెరువును పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశామని, త్వరలో చెరువు మధ్యలో క్యాంటిన్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.


పర్యాటకుల కోసం ముందుగా ఒక స్పీడ్‌ బోటుతో పాటు మూడు స్పెడల్‌ బోట్లను ప్రారంభించామని ఆయన అన్నారు. కాగా, జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సమర్ధనం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా దివ్యాంగులకు మంత్రి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, నాయకులు తాటి గణేష్‌, కోట్ల నర్సింహ్మ, సమర్ధనం సంస్థ ప్రతినిధి రాజశేఖర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


దసరా సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-10-25T06:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising