ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ABN, First Publish Date - 2020-12-30T03:53:37+05:30

ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశా లను అందిపుచ్చుకొని లక్ష్యాన్ని ఛేదించాలని స్వేరోస్‌ వ్యవస్థాపకుడు, రాష్ట్ర గురు కుల విద్యాలయ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  రాష్ట్ర గురు కుల విద్యాలయ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 

పెద్దకొత్తపల్లి, డిసెంబరు 29:  ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశా లను అందిపుచ్చుకొని లక్ష్యాన్ని ఛేదించాలని స్వేరోస్‌ వ్యవస్థాపకుడు, రాష్ట్ర గురు కుల విద్యాలయ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌   పిలుపునిచ్చారు. మం గళ వారం కొల్లాపూర్‌ పట్టణంలో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సం దర్శించారు. పాఠశాల ఆవరణలో ప్రాథమిక చికిత్సాలయం వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉ పాధ్యాయులతో సమీక్షించారు. అనంతరం విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను పరిశీ లించారు. అంతకుముందు పాఠశాలలో డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌, సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వివిధ మండలాల గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, స్వేరోస్‌ కార్యకర్తలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఫ అంతకు ముందు బిజినేపల్లి మండలం పాలెంలో అంబేడ్కర్‌, చాలిక ఐల మ్మ విగ్రహాలకు, నాగర్‌కర్నూల్‌, పెద్దకొత్తపల్లి, పెంటవెల్లి అంబేడ్కర్‌ విగ్రహాల కు  ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించ డంతో పాటు ఉత్తమ వ్యక్తిత్వం పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, సర్పంచ్‌ లావణ్య, జై భీమ్‌ యూత్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T03:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising