ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడివాన

ABN, First Publish Date - 2020-08-15T05:30:00+05:30

అల్పపీడన ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు రోజులుగా ఎడతెపిరి లేకుండా కురుస్తున్న వర్షాలు

నిండిన చెరులువు, కుంటలు


నారాయణపేట/నవాబ్‌పేట/దేవరకద్ర/వనపర్తి (కలెక్టరేట్‌), ఆగస్టు 14 : అల్పపీడన ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఏకధాటిగా ముసురు పడుతూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు వర్షం పడుతూనే ఉంది.


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కోస్గి మండలంలో 24.0 మిల్టీమీటర్లు, నర్వలో 11.4, నారాయణపేటలో 21.2, దామరగిద్దలో 18.5, ధన్వాడలో 19.4, మక్తల్‌లో 16.0, ఊట్కూర్‌లో 22.4, మాగనూర్‌లో 14.4, కృష్ణాలో 13.5, మద్దూర్‌లో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, రెండు రోజులుగా ముసురు పడుతుండటంతో జిల్లాలో సాగు చేసిన పత్తి, కంది పంటలు వర్షపు నీటి నిల్వలతో ఊటకట్టి పంటలకు నష్టం జరుగుతోంది. అలాగే ప్రధాన రహదారులు బురదమయంగా మారాయి. నారాయణపేట నంచి మక్తల్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఎక్లాస్‌పూర్‌, దామరగిద్ద రోడ్‌, కాన్‌కూర్తి రహదారులపై గోతులు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.


వనపర్తి జిల్లా అంతటా ముసురు కమ్ముకొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖిల్లాఘణపురం మండలంలో 17.3 మిల్లీమీటర్లు, వీపనగండ్లలో 15.8, మదనాపురంలో 13.5, పెద్దమందడిలో 12.8, వనపర్తిలో 11.8, గోపాల్‌పేటలో 10.8, కొత్తకోట, పాన్‌గల్‌, చిన్నంబావి, పెబ్బేరు, రేవల్లి మండలాలలో ఒక సెంటీమీటర్‌ చొప్పున వర్షపాతం నమోదైంది. 


మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవాబ్‌పేట మండలంలో కుంటలు, చెరువులు నిండుతున్నాయి. లోకిరేవు, అమ్మాపూర్‌, చౌడూర్‌, యన్మనగండ్ల, రుద్రారం, కాకర్లపాడ్‌, కూచూర్‌, మరికల్‌, కొత్తపల్లి చెరువుల్లో వర్షపు నీరు చేరుతోంది.

Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising