ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించాలి

ABN, First Publish Date - 2020-12-16T04:08:24+05:30

ఇటీవల జిల్లాకు వచ్చిన నూతన పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించి శాఖ పేరుప్రతిష్ఠలను పెంచాలని ఎస్పీ చేతన అన్నారు.

ఇంటరాక్టివ్‌ సెషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ చేతన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట క్రైం, డిసెంబరు 15 :ఇటీవల జిల్లాకు వచ్చిన నూతన పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించి  శాఖ పేరుప్రతిష్ఠలను పెంచాలని ఎస్పీ చేతన అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో ఇంటరాక్టివ్‌ సెషన్‌ కార్యక్రమం నిర్వహించి సిబ్బంది విద్యార్హతలు, విధి నిర్వహణ బాధ్యతలను అడిగి తెలుసుకొని సూచన లు, సలహాలను అందించారు. మహిళా పోలీస్‌ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయిలో ఇంటర్నల్‌ కంప్లెంట్‌ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీకి తమ సమస్యలు నేరుగా చెప్పుకోవచ్చన్నారు. జిల్లా స్థాయి ఇంటర్నల్‌ కంప్లెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ, సభ్యులుగా అడిషనల్‌ ఎస్పీలతో పాటు మరి కొంత మంది సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్‌ఐ కృష్ణ య్య, ఎస్‌బీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising