ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీది హింసాత్మక పాలన

ABN, First Publish Date - 2020-10-03T09:52:31+05:30

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో హింసాత్మక పాలన కొనసాగిస్తోందని యూత్‌ కాంగ్రెస్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌

నియోజకవర్గ అధ్యక్షుడు శివసేనారెడ్డి


వనపర్తి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో హింసాత్మక పాలన కొనసాగిస్తోందని యూత్‌ కాంగ్రెస్‌ నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శివసేనా రెడ్డి విమర్శించారు. గ్యాంగ్‌ రేప్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని పోలీసులు నెట్టివేయడాన్ని ఆయన దుశ్చర్యగా అభివ ర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో కొందరు కీచకులు ఓ దళిత యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేసి హత్య చేస్తే అక్కడి పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి యువతి మృతదేహాన్ని కూడా చూసేందుకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీని అడ్డుకోవ డంతో ప్రభుత్వం రేపిస్టుల పక్షాన ఉన్నట్టు అర్థమవుతోంద న్నారు. దేశంలో పోలీసు, రేపిస్టుల రాజ్యం నడుస్తోందని, ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్ర, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపిస్టులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్యర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. 

Updated Date - 2020-10-03T09:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising