ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2020-10-17T06:57:02+05:30

జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి శరన్న వరాత్రి ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజుకో రూపంలో అమ్మవారు దర్శనం

కొవిడ్‌ నిబంధనల మేరకు పూజలు


నారాయణపేట, అక్టోబరు 16 : జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి శరన్న వరాత్రి ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని పలు దేవాలయాల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శరన్న వరాత్రి ఉత్సవాలు జరిపేందుకునిర్వాహ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన నారాయణపేటలో అంబా భవాని, మరిగమ్మ దేవాలయాలు, రాఘవేంద్ర స్వామి ఆలయం, సాయి బాబాఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిం చనున్నారు. 


మాణిక్యగిరి కొండపై వెంకన్న విగ్రహం

మాణిక్యగిరి కొండపై నారాయణపేటలోని ఏవీ మందార్‌ నివాసంలో వెండి వెంకన్న ఉత్సవ విగ్రహాన్ని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకోసం తరలించారు. కొవిడ్‌ నిబంధనల మధ్య ఉత్సవ విగ్రహాన్ని కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తరలించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ కమిటీ సభ్యులు ఏవీ మందార్‌, సరాఫ్‌ కృష్ణ, బండి శివరాం రెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరి నారాయణ భట్టడ్‌, కౌన్సిలర్లు అనిత సుభాష్‌, బండి రాజేశ్వరి, ఆశ్రమ కమిటీ సభ్యులు, మాత భక్తులు పాల్గొన్నారు. 


యానగుందిలో ...

జిల్లా కేంద్రమైన నారాయణపేట కర్ణాటక సరిహద్దులోని సూర్యనంది క్షేత్రం (యానగుంది)లో శనివారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి, భవాని మాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ మౌతాయని ట్రస్ట్‌ కార్యదర్శి శివయ్య స్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 


సింగారం భవాని మాత ఆలయంలో....

నారాయణపేటరూరల్‌ : మండల పరిధిలోని సింగారం గ్రామంలోని శ్రీగిరి పీఠంపై వెలసిన భవాని మాత ఆలయంలో శనివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోజువారిగా అమ్మవారిని వివిఽధ రూపాల్లో ప్రత్యేక పూజలు అందుకోనున్నారు.

Updated Date - 2020-10-17T06:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising