ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించకుంటే ఎలా?

ABN, First Publish Date - 2020-12-16T03:59:44+05:30

త సమావేశాల తీ ర్మానాలకు అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే ఎలా అని ఎంపీపీ నాగార్జున్‌ రెడ్డి ప్రశ్నించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సమావేశాలకు రావొద్దు

- అధికారుల తీరుపై ఎంపీపీ అసహనం

అడ్డాకుల, డిసెంబరు 15: గత సమావేశాల తీ ర్మానాలకు అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే ఎలా అని ఎంపీపీ నాగార్జున్‌ రెడ్డి ప్రశ్నించారు. మొక్కబడిగా సమావేశాలకు రా వొద్దని అధికారుతీరుపై అసహనం వ్యక్తం చేశారు.  మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో  ఎంపీపీ అధ్యక్షతన  మండల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్య లను ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం పీఆర్‌ ఏఈ అభిషేక్‌ మా ట్లాడుతూ రాంచంద్రాపూర్‌, గుడిబండ బీటీ రోడ్లు, తొమ్మిది కొత్త గ్రామ పంచాయతీ భవనాలు త్వరలో మంజూరు కానున్నాయని తెలిపారు. తహసీల్దార్‌ రాంబాయి రెవెన్యూ ఎజెండా మాట్లాడుతుం డగా అడ్డాకుల గ్రామకంఠంలోని ప్రభుత్వ భూమిని ధర ణిలో వ్యవసాయ భూమిగా పట్టాపాస్‌బుక్‌ ఇవ్వ డం వలన రైతువేదిక భవన సమస్య గ్రామంలో తీవ్రరూపం దాల్చిందని ఇలా ఎందుకు చేశారని సింగిల్‌విండో అధ్యక్షుడు జితేంద్‌రెడ్డి తహసీల్దార్‌ ను ప్రశ్నించారు. మదనాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాకాబాల్‌ నారాయణ మాట్లాడుతూ ఎస్‌ ఎస్‌వీ కాటన్‌మిల్లులో మార్చి వరకు పత్తి కొనుగో లు చేస్తామని, ఇప్పటివరకు 4860 క్వింటాళ్ల పత్తి సీసీఐ కొనుగోలు చేశారని అన్నారు. సమావేశంలో  వైస్‌ ఎంపీపీ రాధిక,  గ్రామాల ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ మంజుల, వివిధశాఖ అధికారులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T03:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising