ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ ఫలాలు ప్రజలకు సకాలంలో చేరాలి

ABN, First Publish Date - 2020-12-04T03:33:55+05:30

ప్రభుత్వం పేద ప్రజల సంక్షే మం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు సకా లంలో అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయాలని ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

బిజినేపల్లి, డిసెంబరు 3: ప్రభుత్వం పేద ప్రజల సంక్షే మం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు సకా లంలో అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయాలని ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ హాల్‌లో గురువారం మండల సర్వసభ్య సమావేశానికి హాజరై ఆయన మాట్లాడా రు. ముందుగా ఆయా శాఖల పనితీరుపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని శాఖల అధికారుల పనితీరు బాగా లేదని బాహాటంగానే సభ్యులు విమర్శించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందిం చాలన్నారు. పంచాయతీ, వైద్యం, తాగునీరు, విద్యుత్‌, అబ్కా రీ శాఖల తీరులో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లు, ఎం పీటీసీల సహకారంతో అభివృద్ధి పనుల్లో మెరుగైన ఫలితాలు తీసుకరావాల న్నారు. అనంతరం రూ. కోటి విలువైన 101 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. జడ్పీటీసీ సభ్యుడు తూం హరిచరణ్‌రెడ్డి వైస్‌ ఎంపీపీ చిన్నారెడ్డి, తహసీల్దారు అంజిరెడ్డి, ఎంపీడీవో హరినాథ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగనమోని కిరణ్‌, సర్పంచ్‌లు బాలీశ్వర్‌, శేఖర్‌రెడ్డి, మహేష్‌రావు, ఎంపీటీసీలు మంగి విజయ్‌, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2020-12-04T03:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising