ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా నిరసనలు

ABN, First Publish Date - 2020-12-06T04:40:58+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జిల్లా అంతటా రైతు, కార్మికసంఘాలు, వివిధ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్య క్రమాలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహనం చే శారు.

బిజ్వార్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు సలీం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 జిల్లా అంతటా ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం


నారాయణపేట/ నారాయణపేట రూరల్‌/ ఊట్కూర్‌/ మక్తల్‌/ దామరగిద్ద, డిసెంబరు 5 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జిల్లా అంతటా రైతు, కార్మికసంఘాలు, వివిధ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్య క్రమాలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహనం చే శారు. పేటలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిసెంబరు 8న భారత్‌ బంద్‌తో ప్రజల ఆగ్రహానికి  గురికావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. సత్యనారాయణరెడ్డి, సత్యప్ప, కృష్ణ, నారాయణ, రవి, ఆశప్ప పాల్గొన్నారు.

పేట మండలం అభంగాపూర్‌లో ఏఐకేఎంఎస్‌, కోటకొండలో సీపీఎం, ఊట్కూర్‌ మండలం బిజ్వార్‌, మక్తల్‌లలో ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కార్యక్రమాల్లో ఆయా పార్టీలు, సంఘాల నాయకులు చెన్నారెడ్డి, నారాయణ, రామాంజనేయులు, సోలప్ప, వెంకటయ్య, భీములు, రాములు, బాలప్ప, బాలకృష్ణ, గోవిందు, నాయకులు యాదప్ప, తిరుపతి, సలీ, మల్లేష్‌, ఉప సర్పంచ్‌ పొర్ల నర్సింహ, సిద్దు, గోవర్దన్‌రెడ్డి, ఆంజనేయులు, ఎల్లప్ప, రైతులు ఆశప్ప, రామన్న, పాల్గొన్నారు.

మక్తల్‌లో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.క్రిష్ణ, జిల్లా అధ్యక్షుడు సలీం, ఉపాధ్యక్షులు భగవంతు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌, నాయ కులు ఏజీ బుట్టో, ఆనంద్‌, అజయ్‌, కనకరాయుడు, వెంకటేష్‌, బాబు, లింగప్ప, తిరుమలేష్‌, శివ, భాస్కర్‌  పాల్గొన్నారు. 

దామరగిద్ద, ఉడ్మల్‌గిద్ద, క్యాతన్‌పల్లి, ముస్తానేట్‌, నర్సాపూర్‌, క్యాత్‌పల్లి గ్రామాల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గోపాల్‌, అంజిల య్యగౌడ్‌, అశోక్‌, భీంషప్ప, రాములు, రాజేందర్‌, వెంకట్రాములు ఉన్నారు.

Updated Date - 2020-12-06T04:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising