ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-05T04:05:06+05:30

రోడ్డు ప్ర మాదంలో ఓ యువకు డు మృతి చెందిన సంఘటన మండలం లోని మందిపల్లి తండా గేటు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధన్వాడ, డిసెంబరు 4 : రోడ్డు ప్ర మాదంలో ఓ యువకు డు మృతి చెందిన సంఘటన మండలం లోని మందిపల్లి తండా గేటు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మందిపల్లి గ్రామాని కి చెందిన  కావలి రమేష్‌ (25) అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా టై ర్‌ పంక్చర్‌ అయి అదుపుతప్పి అదే సమయంలో మరికల్‌ నుంచి వస్తున్న జీపును ఢీకొంది ఈ సంఘటనలో రమేష్‌ తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా మార్గమ ధ్యలో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సంఘ టనపై పోలీసులు కేసు నమోదు చేశారు.



డీలర్ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మృతి


గండీడ్‌, డిసెంబరు 4 : డీలర్ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అనా రోగ్యంతో శుక్రవారం మృతిచెం దాడు. కొన్ని రోజుల నుంచి అ నారోగ్యంతో బాధప డుతుండ గా మహబూబ్‌నగర్‌ ఎస్‌వీ ఎస్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడచికిత్సపొందుతూ మృతి చెందాడు. ఆయన మృతిపట్ల డీలర్ల సంఘం మండల అధ్య క్షుడు ఎన్‌.లక్ష్మయ్య, కార్యదర్శి గోపాల్‌గౌడ్‌, నరేందర్‌గౌడ్‌ ప్రగాఢసానుభూతిని తెలిపారు.


కస్తూర్బా పాఠశాలలో పాము కలకలం


మూసాపేట, డిసెంబరు 4 : మండల కేంద్రమైన మూసా పేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం పాము కలకలం రేపింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయ బృందం పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో కానిస్టేబుల్‌ జావిద్‌ అక్కడికి చేరుకొని పామును పట్టేందుకు గంటకు పైగా ప్రయత్నం చేసినా దొరకలేదు. చేసేది లేక పామును ఓ పెద్ద కర్రతో చంపడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చు కున్నారు. ఆ పామును జేర్రిపోతుగా గుర్తించారు.ద దాదాపు 8ఫీట్ల పొడువు ఉంది. 


ఇబ్రహీంబాద్‌లో కొండ చిలువ ..


హన్వాడ, డిసెంబరు 4 : మండలంలోని ఇబ్రహీంబాద్‌లో కొండచిలువ కలకలం రేపింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలో వరి బస్తాల దగ్గర నిద్రిస్తుండగా కొండచిలువ కనిపించడంతో భయాందోళన చెందారు. దీంతో పలువురు రైతులు దాన్ని కొట్టి చంపారు. 

Updated Date - 2020-12-05T04:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising