నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. రిలే నిరాహార దీక్ష ప్రారంభం
ABN, First Publish Date - 2020-12-16T04:04:53+05:30
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల ని ఏఐకేసీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్కు ముందు వామపక్ష పార్టీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు.
నారాయణపేట టౌన్, డిసెంబరు 15 : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల ని ఏఐకేసీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్కు ముందు వామపక్ష పార్టీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు తెచ్చేందుకు చట్టాలను తెచ్చిందని విమర్శించారు. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చ లిని సైతం లెక్క చేయకుండా 19 రోజులుగా రోడ్ల మీదికొచ్చి నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం సరి కాదన్నారు. ఈ చట్టాలవల్ల రానున్న కాలం లో ఆహారకొరత ఏర్పడి సామాన్యులు బతుకలేని పరిస్థితి ఏర్పడుతుందనా పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం, సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కాశీనాథ్, వెంకటేష్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షు రాలు జయ, ఎంపీటీసీ సునిత, పీడీఎస్‌యూ సాయి, ఎస్‌ఎఫ్‌ఐ నరహరి, భూ సంరక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T04:04:53+05:30 IST