ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను పెంచి పచ్చదనాన్ని కాపాడాలి

ABN, First Publish Date - 2020-06-29T11:02:29+05:30

ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, కలెక్టర్‌ హరిచందన, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె అనసూయ కోరారు. 6వ విడత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ 


నారాయణపేట/నారాయణపేట టౌన్‌/ నారాయణపేట రూరల్‌/ ఊట్కూర్‌, జూన్‌ 28 : ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, కలెక్టర్‌ హరిచందన, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె అనసూయ కోరారు. 6వ విడత హరితహారంలో భాగంగా ఆదివారం కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలు నాటి వారు మాట్లాడారు. మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10గంటలకు కలెక్టర్‌ హరిచందన తన నివాసంతోపాటు తన కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పూల కుండీలు, స్టోర్‌ రూంలు నీరు నిల్వఉండే ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టారు. నారాయణపేట మండలం సింగారం చౌరస్తా నుంచి అంబ్కేర్‌ చౌరస్తా వరకు గల రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఆర్‌అండ్‌బీ, అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం రహదారి వెంట కలెక్టర్‌ పర్యటించారు.


ఆమె వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ట్కూర్‌ మండలంలోని నిడుగర్తి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉపాధ్యాయులు హరితహారం నిర్వహించారు. ఉప సర్పంచ్‌ మొగులప్ప, ఎస్‌ఎంసీ చైర్మన్లు నర్సిములు, మఖ్బుల్‌ ఖాన్‌ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివరాజ్‌, ఉపాధ్యాయులు వెంకటప్ప, లియాఖత్‌, ఆంజనే యులు, శ్రీనివాస్‌, నర్సింహ, గిరిజప్ప, రాములు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-29T11:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising