ప్రజలకు చేరువలో ఉండి సేవ చేయండి
ABN, First Publish Date - 2020-12-29T03:45:42+05:30
ప్రజలకు చేరువలో ఉండి సేవ చేయాలని నాగ ర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ పద్మావతిలు అన్నారు.
- మండల సమావేశంలో ఎంపీ పి.రాములు
కందనూలు, డిసెంబరు 28: ప్రజలకు చేరువలో ఉండి సేవ చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ పద్మావతిలు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ ఎంపీపీ చాంబర్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజ రయ్యారు. చాంబర్ ప్రారంభించిన అనంతరం ఎంపీపీ నర్సింహారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. వచ్చే జనరల్‌బాడీ సమావేశానికి డివిజనల్ స్థాయి అధికారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. జడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీడీవో కోటేశ్వర్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T03:45:42+05:30 IST