పరిహారం చెల్లింపులో జాప్యం తగదు
ABN, First Publish Date - 2020-12-06T03:48:35+05:30
డీఎల్‌ఐ నిర్వాసితులకు భూ పరిహారం చెల్లింపులో జాప్యం తగదని వెంటనే వారి డిమాండ్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని జాతీయ బీసీ కమిషన్, సభ్యుడు, బీజేపీ నేత తల్లోజు ఆచారి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి
వంగూరు, డిసెంబరు 5: డీఎల్‌ఐ నిర్వాసితులకు భూ పరిహారం చెల్లింపులో జాప్యం తగదని వెంటనే వారి డిమాండ్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని జాతీయ బీసీ కమిషన్, సభ్యుడు, బీజేపీ నేత తల్లోజు ఆచారి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని తిర్మలగిరిలో డీఎల్‌ఐ నిర్వాసితులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ డీఎల్‌ఐ కాల్వల ని ర్మాణంలో రైతులు సాగు భూములను కోల్పోయి మాడేళ్లు దా టినా నేటికి పరిహారం చెల్లించక పోవటం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎకరానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సర్పంచ్ మల్లయ్యయాదవ్, ఎంపీటీసీ లక్ష్మ మ్మను పూలమాల, శాలువాలతో ఆచారి సన్మానించారు. బీజే పీ మండల పార్టీ అధ్యక్షుడు ఖానాపురం భాస్కర్, అల్లెభీమ య్య, సైదులు, శివస్వామి, కొండల్‌రెడ్డి, కడారి వెంకటయ్య, అంజి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-06T03:48:35+05:30 IST