ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణాల ప్రగతి మారాలి: కలెక్టర్‌ హరిచందన

ABN, First Publish Date - 2020-02-20T06:34:09+05:30

మునిసిపాలిటీలలో ఈనెల 24 నుంచి 10రోజుల పాటు చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం వల్ల పట్టణ రూపురేఖలు మారాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి19: మునిసిపాలిటీలలో ఈనెల 24 నుంచి 10రోజుల పాటు చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం వల్ల పట్టణ రూపురేఖలు మారాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మునిసిపాలిటీల పట్టణ ప్రగతి సదస్సు మహబూబ్‌నగర్‌లో బుధవారం జరిగింది. ఆబ్కారి, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఈ సమావేశంలో కలెక్టర్‌ హరిచందన మాట్లాడారు. ఆహ్లాద కరమైన పట్టణ వ్యవస్థ వైపు అడుగులు వేయడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమన్నారు. పచ్చదనం, పారి శుధ్యం వంటి అంశాలు ప్రణాళికాబద్ధంగా అమలు చేయ డం వల్ల పట్టణ పౌరులకు మెరుగైన సేవలు అందు తాయని అన్నారు. దీనివల్ల జీవన ప్రమాణాలు పెంపొం దించేందుకు ప్రత్యేక కమిటీల ద్వారా కృషి చేయనున్నట్లు తెలిపారు. వార్డుల్లో పారిశుధ్యం, ఘన వ్యర్థాల యాజ మాన్యం నిర్వహించడం, మొక్కలు నాటడం 80 శాతం నాటిన మొక్కలు బతికించాలని సూచించారు. పార్కులు, ఆట స్థలాలు, పబ్లిక్‌ టాయిలెట్లు మార్కెట్‌ స్థలాల నిర్వహణ, మునిసిపల్‌ పన్నులు, ఫీజులు ఇతర బాకీలు వసూలుకు సౌకర్యాలు కల్పించడం, అనధికార నిర్మాణాలు, అతిక్రమణలు కూల్చివేయడం, ప్లాసిక్‌ వినియోగాన్ని తగ్గించడం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఆటలను ప్రోత్సహించాలన్నారు. 

ప్రజల భాగస్వామ్యంతోనే. ..

పల్లెప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయ వంతమైందని, పట్టణ ప్రగతిలోనూ ప్రజలను భాగ స్వాములను చేయాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నా మని, రాబోయే రోజుల్లో వీటి స్వరూపం మారాలని సూ చించారు. పట్టణ ప్రగతిలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే వార్డుల కమిటీ ఆవశ్యకమని, ఒక్కోవార్డులో నాలుగు కమి టీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కమిటీలు వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్క రించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అనసూయ, వైస్‌చైర్మన్‌ హరినారాయణ్‌ భట్టడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T06:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising