ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతల ఆందోళన

ABN, First Publish Date - 2020-11-29T05:09:37+05:30

ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు ఆందోళనకు దిగారు.

మూసాపేట వద్ద ఎన్‌హెచ్‌-44పై రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూసాపేట/జడ్చర్ల, నవంబరు 28 : ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌న గర్‌ జిల్లా మూసాపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెం దిన రైతులు శనివారం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయాల ని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా తహసీల్దార్‌ మంజుల, మండల వ్యవసాయాధికారి రా జేందర్‌రెడ్డి ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ ఏ డాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయామని అ న్నారు. మిగిలిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొ నుగోలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే తాము అప్పులు ఎ లా కట్టాలని, ఆత్మహత్యలే దిక్కని వాపోయారు. దీనికితోడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం నానిపోయి మరింత నష్టం వాటిల్లిందని చెప్పారు. దీంతో తహసీల్దార్‌ జి ల్లా అధికారులకు ఫోన్‌ చేసి విషయాన్ని వివరించారు. ఆదివా రం నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు అధికా రులు చెప్పారని ఆమె సమాధానం ఇవ్వడంతో రైతులు ధర్నా ను విరమించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అ నంతరం ఎన్‌హెచ్‌-44పై రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో ఆ యా గ్రామాల రైతుబంధు అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.

అలాగే రైతులు పండించిన ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి పత్తి మార్కెట్‌ యార్డు ఆవరణలో అఖిల పక్షం నా యకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రైతురాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబీ బాలకృష్ణ, సీపీఎం నాయకులు దీప్లానాయక్‌, జగన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising