ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ అంటే సిద్దిపేట, గజ్వేలేనా ?

ABN, First Publish Date - 2020-12-12T04:21:52+05:30

సీఎం కేసీఆర్‌ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రా లేక సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్ర మే ముఖ్యమంత్రా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌


నారాయణపేటటౌన్‌, డిసెంబరు 11 : సీఎం కేసీఆర్‌ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రా లేక సిద్దిపేట, గజ్వేల్‌కు  మాత్ర మే ముఖ్యమంత్రా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. తెలంగాణ రావడానికి కేసీఆర్‌ ఎంపీ కావడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా ప్రజలే కారణమని పేర్కొన్నారు. నాడు ఈ ప్రాంత ప్రజలు మద్దతునిచ్చి గెలిపించకపోతే కేసీఆర్‌ ఎంపీగా ఉండేవారు కాదని, తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా బతికించిన నారాయణపేటను ముంచి గజ్వేల్‌, సిద్దిపేటకు ప్రాధాన్యతనివ్వడం విడ్డూరమని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ఆరేళ్ల పాలనలో నారాయణపేట లో ఒక్క డబుల్‌ బెడ్‌రూం నిర్మించలేదని తెలిపారు. నారా యణపేట జిల్లా అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ పక్షపాతం చూయిస్తున్నా ఇక్కడి ఎమ్మెల్యేలు నోళ్లు మూసుకున్నారని, అభివృద్ధి విషయంలో జిల్లా ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలకు తగురీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2020-12-12T04:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising